అర ఎకరంలో సొంత ఉపాధి

అర ఎకరంలో సొంత ఉపాధి

ఎదుటి వారితో తనని పోల్చుకొని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది

అర ఎకరంలో సొంత ఉపాధి

గ్రామాల్లో నివాసిస్తున్నా యువకులు ఉద్యోగలకోరకు సిటీ కి వెళ్లి ఇబ్బంది పడుతూ ఎదో ఒక చిన్న ఉద్యోగంలో ఇరుక్కుపోయి జీవితము మొత్తం ఇబ్బంది పడకుండా ఉన్న ఊరిలొనే ఉపాధి పొందొచ్చు.

ముందుగా మనిషికి నిత్యావసరలు బియ్యం పప్పులు, పాలు మరియు కూరగాయలు.

ప్రతి కుటుంబం (5 మంది సభ్యులు) నెలకు తక్కువలో తక్కువ 8 KG ల టమోటాలు, 2 KG పచ్చి మిరపకాయలు మరియు 3 KG ల ఉల్లిగడ్డలు ఖచ్చితంగా ఉపయోగిస్తూనే బెండకాయ, వంకాయ, బీర, అలుగడ్డలు …మొదలైనవి ఒక్కోరకం కనీసం 3 kG లు అయిన కొనుగోలు చేస్తారు. ఈ ప్రకారం ప్రతి కుటుంబం సగటున తక్కువలో 600 నుండి 1000 వరకు ఖర్చు చేస్తారు.

అర ఎకరం 50 సెంట్లు భూమిని 2 భాగాలుగా చేయండి.
20 సెంట్లు 1 = 30 సెంట్లు 2బ్యాచ్
20 సెంట్లలో 150 మొక్కలు టమోటా, 100 మొక్కలు మిరప, 50 మొక్కల ప్రకారం 5 రకాల కూరగాయ మొక్కలు నటండీ మిశ్రమ పద్ధతిలో.

మిగిలిన 30 సెంట్ల భూమిలో మూడు తరగతులుగా విభజించి ఆకు కురలు వేయండి 35 రోజులకే కోతకు వస్తాయి

* ప్రతి పది సెంట్లు భూమి ఆకుకురాలకు మధ్య 20 రోజుల తేడా ఉండేలా చూడండి.

* ప్రతి 10 సెంట్లలో 5 సెంట్లు భూమి లో వేర్ల వరకు పీకే ఆకుకూరలు ఉదాహరణకు కొత్తిమీర, మెంతికురా లాంటివి మిగిలిన 5 సెంట్లు కోతకోయడానికి విలయ్యే ఆకుకూరలు ఉదాహరణకు గోంగూర ,తోటకూర, పాలకూర మొదలైనవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి

* మొదటి పది సెంట్లలో వేసిన ఆకుకురాలు 30 నుండి 35 రోజుల్లో కోతకు వస్తాయి.

* కోతకు రాగానే వేర్లవరకు తీసే మొక్కలని అలానే తీస్తూ కోతకు వీలుగా ఉన్న ఆకుకూరలను కత్తిరించి దగ్గరాలో ఉన్న మార్కెట్ దగ్గరకు తీసుకువెళ్లలి తాజాగా ఉండేలా చుసుకోవాలి. ఇలా ప్రతిరోజు .5 సేంట్ భూమిలో ఉన్న ఆకుకూరలను మార్కెట్ చెయ్యాలి.

* మొదటి బ్యాచ్ ఆయుపోయేలోపు 20 రోజుల్లో అయిపోతుంది. రెండో బ్యాచ్ 10 సెంట్లు మనకు రెడీ అవుతుంది.

* మొదటి బ్యాచ్ లో కత్తిరించి మార్కెట్ చేసిన 5 సెంట్లు అలాగే ఉంచి ఆ మొక్కలకు సేంద్రియ ఎరువులు మరియు నీరు అందించలి మళ్ళీ చిగురు తొడుగుతుంది.

* మొదటి బ్యాచ్ లో వేర్లతో పాటు తీసిన ఆకురాల 5 సెంట్లు భూమిలో

మళ్ళీ 40 టమోటా మొక్కలు, 30 మిరప మొక్కలు 20 మొక్కల ప్రకారం 4 రకాల కూరగాయల మొక్కలి వేయాలి.

* రెండో బ్యాచ్ ఆకురాలు కూడా మొదటి 10 సెంట్లు మాదిరిగానే
వేర్లతో పాటు తీసేవి తీస్తూ కత్తిరించడానికి వీలు ఉన్న ఆకుకూరలు కత్తిరించి మార్కెట్ చేయాలి ఈ బ్యాచ్ పూర్తి అయిపోయే లోపుఇప్పటికి 50 రోజులు అవుతుంది.

*50 తరువాత నుండి 20 సెంట్ల భూమిలో వేసిన కూరగాయలు కోతకు రావడం మొదలు పెడుతూ వుంటయి వాటితో పాటు మొదటి బ్యాచ్ లోని కత్తిరించి మార్కెట్ చేసిన ఆకుకూరల కోనలు మళ్ళీ కోతకు సిద్ధము అవుతయి కూరగాయలు ఆకురాలు రెండు కలిపి మార్కెట్ కి తీసుకు వెళ్తాము.

* రెండో బ్యాచ్ ఆకుకూరల్లోని వేర్లుతో పాటు పికి ఖాళీ చేసిన 5 సెంట్లు భూమిలో మళ్ళీ కూరగాయలు 8:6:4:2:1 నిష్పత్తిలో వేయాలి. అప్పటికి 70 రోజులు ఆవుతయి.

* మొదటి 20 సెంట్లు భూమిలో వేసిన అన్ని రకాల కూరగాయలు మంచి దిగుబడి ఇస్తుంటాయి ఆ కుగాయలను మూడో బ్యాచ్ 10 సెంట్లలో లో ఉన్న ఆకుకూరలను మరియు మొదటి 10 సెంట్ల భూమిలోని కత్తిరించిన 5 సెంట్ల భూమిలో ఉన్న తిరిగి ఆకువేసిన ఆకుకురాలను కలిపి మార్కెట్ చెయాలి అప్పటికి 100 రోజు అవుతయి.

* మూడో బ్యాచ్ 10 సెంట్లలోని ఆకుకూరలు పూర్తి అయ్యేలోపు మొదటి బ్యాచ్ ఆకుకురాల స్థలంలో నాటిన కూరగాయలు కాపుకు వచ్చలా ప్లాన్ చేసుకోవాలి.

* ఈ విధానం వల్ల ప్రతి రోజు ఉపాధి దొరుకుతుంది అన్ని ఖర్చులుపోను రోజు 300 నుండి 400 వరకు ఆదాయం వస్తుంది నెలకు 10 వేల రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి.

* సొంతంగా మార్కెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితాలు వుంటాయి.

* సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులు వాడండి

*మిశ్రమ పద్దతిలో సాగు చేస్తున్నారు కనుక మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలు తక్కువ కానీ వేప నూనె స్ప్రే చేస్తుఉండటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *