పాడి పరిశ్రమ

పాడి పరిశ్రమ

పాడి పరిశ్రమ

ప్రతి మనిషి దైనందిన జీవితంలో పాలు కూడా ఒక భాగమే.

కొత్తగా పాడి పరిశ్రమలోకి రావాలి అనుకునేవారు ముందు ఓపిక మరియు పనిచేసే స్వభావము ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకోగలిగితే మంచిది.

* ముందుగా తక్కువ ఒకటి లేదా రెండు పశువులతో ప్రారంభించండి మీ దగ్గర ఎక్కువ పశువులు కొనేందుకు ఆర్థిక వసతి ఉన్న వద్దు.

* ఆ రెండు పశువులకు అవసరం అయిన నీరు ,దాన మరియు పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

*పాలను మీకు అవకాశము ఉంటే ..మిరే అమ్ముకొండి సాధ్యమైన వారు.

* ఒక 6 నెలలు అయ్యాక మీకు ఒక అవగాహన వస్తుంది కనుక అప్పుడు ఇంకో రెండు లేదా నాలుగు పశువులను టీసుకోండి.

* మొదటి 10 రోజుల్లో ఆ కొత్త పశువులు అక్కడి వాతావరణనికి అలవాటుపడతాయి అంటే మిగిలిన పశువులతో కలిసిపోతాయి.

*మీరు అప్పటికే వాటిని పోషించడంలో కొంత అనుభవం పోంది ఉండటం వాళ్ళ ఈ కొత్త పశువుల పోషణ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంత శ్రమ అధికం అవుతుంది.

* ఇంకో 6 నెలల తరువాత మరో 6 పశువులు తీసుకురండి . ఇపుడు ఒక సహాయకుడిని కూడా పెట్టుకోండి.

* కొత్తగా తీసుకొని వచ్చే పశువులు కొన్ని నెలల తేడాలో డెలివరీ అయ్యేవాటిని టీసుకోండి .. అన్ని ఒకేసారి అయితే మీకు మీకు శ్రమ అధికం అవుతుంది.

* పాలు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోండి.

* ఒక పశువు పాలు ఇవ్వడం పూర్తి అయ్యేలోపు మరో పశువు పాలు ఇవ్వడం మొదలు పెట్టేలా చూసుకోండి.

* పుట్టిన దూడలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అవి త్వరగా ఎదిగి మీకు అందుబాటులోకి వస్తాయి.

జాగ్రత్తలు
* పశు వైద్యుడిని అందుబాటులో పెట్టుకోండి.

* మన వాతావరణనికి తట్టుకొనే మేలు జాతి పశువులను ఎన్నుకోండి.

* పశువుల దగ్గర నీరు నిల్వ లేకుండా చూసుకోండి.

* సాధ్యమైనంత వరకు దాన కొనుగోలు చేయకుండా .సొంతగా తయారుచేసుకోండి.

* పగటి పూట పశువుల పాకలో కోళ్ళు తిరిగేలా చూడండి పశువులపైన ఉండే పరన్న జీవులను ఇవి తినేస్తాయి.

* ఎండుగడ్డి తక్కువ రేట్ వున్నప్పుడు కొంత ఎక్కువ కొని పెట్టుకోండి.

ముఖ్యముగ
*పాలు నేరుగా అమ్మకుండా.. విలువ జోడించి అమ్మడానికి ప్రయత్నించండి.

* బ్యాంక్ లోన్ తీసుకుంటే సరియైన సమయంలో కట్టేయండీ మళ్ళీ అవసరానికి బ్యాంక్ మీకు సహకారం అందిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *