పుదీనా సాగు

పుదీనా సాగు

పుదీనా సాగు

* ఒక్కసారి నాటితే ఒక సంవత్సరం మొత్తం ఆదాయాన్ని ఇచ్చే ఆకుకురా పుదీనా.

* నీరు నిల్వ ఉండని ఇసుక ఆధారిత నల్ల నేలలు సాగుకు అనుకూలం.

* సాధారణంగా వేసవికాలం ఏప్రిల్ మరియు మే నెలలో నాటితే అధిక ఫలితాలు ఉంటాయి.

*విత్తనంగా ముందు పంట యొక్క కాండపు కొమ్మ మొద్దులను విత్తనము గా ఉపయోగిస్తారు.

* ఒక కాండపు కొమ్మ మొక్కకు మరియొక మొక్కకు 45 CM దూరం ఉండేలా చూసుకోవాలి.

*నాటిన మొద్దుల నుండి 40 రోజుల్లో పంట మొదటి కోత వస్తుంది.

* మొదటి కోత తరువాత ప్రతి 30 నుండి 35 రోజులకు తిరిగి కోతకు వస్తుంది.

* ప్రతి పుదీనా మొక్క ఒక సంవత్సర కాలంలో 7 నుండి 8 కోతలు వస్తుంది.

* కొమ్మలు 30 నుండి40 cm ఎత్తు పెరిగెలోపు కోత కోయడం వల్ల పుదీనాలో నాణ్యత అధికంగా ఉంటుంది.

* ఒక ఎకరాం భూమి సాగు ప్రామాణికంగా తీసుకుంటే 70 నుండి 80 మడులుగా తీసుకోవాలి లేదా ఒక సేంట్ భూమి ఒక మడిలాగా ఆయిన తీసుకోవచ్చు.

* పుదీనా మొక్కలను భూమికి దగ్గరా కత్తిరించలి

* ఒక మడి లేదా గది నుండి ఒక కోతకు 1500 కట్టల వరకు మార్కెట్ చేసే స్థాయి కట్టల పుదీనా వస్తుంది.

* కోత కోసిన వెంటనే నీరు పెట్టకుండా 3 నుండి 4 రోజులు మొక్కల మొద్దు ఎండనిచ్చి ఆ తరువత సేంద్రీయ ఎరువులు మరియు నీరు పెట్టాలి.

* ప్రతి 7 నుండి 10 రోజులకు ఒక నీటి తడి అందివ్వాలి.

* పుదీనా ఎడారి మొక్కల ఆకులు మందంగా వుంటు భూమికి దగ్గరా చిక్కగా ఉంటాయి కనుక దోమలు మరియు రసం పీల్చు పురుగులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. క్రమము తప్పకుండా వేప నూనె పిచికారి చేయడం వల్ల నివారించవచ్చు.

* పుదీనా ఔషధ మొక్క మెంతలు అనే నూనె కొద్ది మొత్తంలో ఉంటుంది మంచి సువాసన కలిగి ఉంటుంది.

*పుదీనా నూనెను అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది

*పుదీనా మొక్క యొక్క ప్రత్యేక రుచికి కార్బోస్ అనే సుగంధ పదార్థం కారణం.

* పుదీనా మొక్కల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా జాపనీస్ పుదీనా, స్పియరు పుదీనా, పిప్పరమెంట్ పుదీనా మరియు బర్గమేట్ పుదీనా ఎక్కువగా సాగులో ఉన్నాయి.

* మన భారతదేశంలో అయితే జపనిస్ పుదీనా లో ఉన్న హిమాలయ, కోసి, శివాలిక్ మరియు సక్షం అనే 4 రకాల పుదీనా రకాలు అధికంగా సాగులో ఉన్నాయి.

* నేల ను సిద్ధం చేసే ముందు బాగా భూమి కలియా దున్ని (ఎక్కువ లోతు అవసరం లేదు) పశువుల ఎరువులు మరియు జీవ ఎరువులు వేసి సిద్ధం చేసుకోవాలి.

* ఒక క్రమ పద్ధతిలో సాగు చేసుకంటే ప్రతి రోజు దిగుబడి పొందొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *