(గింజ బరువు పెరగడానికి (సుమారు 20 శాతం అధికం)నాణ్యత,మెరుపు రావటానికి)
1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : నువ్వులు 100 గ్రా,పెసలు 100 గ్రా,మినుములు 100 గ్రా,బొబ్బర్లు 100 గ్రా,
కందులు 100 గ్రా,శనగలు 100 గ్రా,గోధుమలు 100 గ్రా.
తయారీ చేసే విధానం: ముందుగా నువులని ఒక పాత్రలో 12 గంటలు నానబెట్టాలి,నువ్వులు నానిన తర్వాత
మిగితా 6 రకాల గింగలను కలపాలి,గింజలు మునిగే వరుకు నీరు పోసి 12 గంటలు నానబెట్టాలి.మొలకెత్తిన తర్వాత గింజలను గుడ్డాతో కటి రెండు అంగుళాల మొలకలు వచ్చే వరుకు గుడ్డలో ఉంచాలి,తర్వాత మొలకెత్తిన గింజలను అన్నిటిని కలిపి మెత్తగా రుబ్బాలి,ఒక పాత్రలో 200 లీటర్లు నీటిని తీసుకోవాలి ఇందులో మెత్తగా రుబ్బిన మొలకుల ముద్దని కలపాలి,10 లీటర్లు ఆవు మూత్రం కలపాలి,పాత్రపై గోనెసంచి కప్పి 24
గంటలు పులియనివాళి,రోజుకి 2 సార్లు కర్రతో కలపాలి,టానిక్ తయారువుతుంది
ఉపయోగించే విధానం : ఈ వీదంగా తయారైన టానిక్ ఎకరానికి(200 లీటర్లు) ఎలాంటి నీరు కలపకుండా యధావిధిగా పంటపై పిచ్కాటి చేసుకోవాలి