ప్రకృతి  వ్యవసాయం  తెగుళ్ల మందులు

ప్రకృతి వ్యవసాయం తెగుళ్ల మందులు

                               పశువుల పేడ,ముత్రం,ఇంగువ ద్రావణం  

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలుపశువుల పేడ 5 కిలోలు,పశువుల మూత్రం 5 లీటర్లు,సున్నం 150 గ్రాములు,ఇంగువ 200 గ్రాములు.

తయారీ చేసే విధానం:   5 కిలోల పశువుల పేడ, 5 లీటర్లు మూత్రం తీసుకొని 5 లీటర్లు నీటిని కలిపి ఒక తొట్టిలో

నిలువ చేయాలి,తోటి పై మూత పేటి 4 రోజుల పాటు ఆ మిశ్రయాని మురగపెట్టాలి,ఈ మిశ్రయాని రోజు ఉదయం,సాయంత్రం కర్రతో బాగా కలియబెట్టాలి,ఈ మిశ్రయానికి 150 గ్రా సున్నం,200 గ్రా ఇంగువను కలిపి వడకట్టాలి.

జాగ్రత్తలు:పశువుల పేడ, మూత్రం,ద్రావణం చిక్కగా ఉంటుంది కనుక మొదట ఒక మెష్ గని,పలుచటి గోనెసంచి గని ఉపయోగించి వడపోయాలి,దానికి నీరు కలిపి పలుచటి గుడ్డాతోవడపోసుకోవాలి,దినిని ఒకటి,రెండు రోజుల పాటు నిలువ ఉంచుకోవచ్చు.

ఉపయోగించే విధానం :  ఒక ద్రావణానికి 100 లీటర్లు నీటిని కలిపి ఒక ఎకరం పొలం లో పిచికారీ చేయాలి.

గమనిక:ఈ  ద్రావణాని పిచికారీచేస్తే రేఖల పురుగులు ఆ వాసనకి గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు,ఈ ద్రావణం

పంటలలో వ్యాధినిరోధకశక్తి కూడా పెంచుతుంది.