బీజామృతం
తయారీకి కావలసిన పదార్థాలు
అవుపేడ : 5 కిలోలు
నీరు : 20 లిటర్లు
ఆవు మూత్రం : 5 లీటర్లు
సున్నం : 50 గ్రాములు
గుప్పెడు మట్టి ( చేను గట్టు మట్టి/ అడవి మట్టి)
తయారీ విధానం
పేడను మూటకట్టి 20 లీటర్ల నీటిలో వేలాడదీయాలి. ఇందులో ఆవు మూత్రం, సున్నం కలపాలి, 12 గంటలవరకు అలానే ఉంచాలి. కర్రతో రోజుకు 2 సార్లు కలపాలి. బీజామృతం తయారవుతుంది.
ఉపయోగించే విధానం
1) విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై ఈ మిశ్రమాన్ని చల్లాలి. నీడలో ఆరబెట్టిన తరువాత విత్తుకోవాలి. దీనివల్ల విత్తనం బాగమొలకెత్తుతుంది. విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి తోడ్పడుతుంది.
2) అరటి పిలకలు లేదా చెరుకు కనుపుల బీజామృతంలో ముంచి నాట్లు వేయాలి.
3) వరి, ఉల్లి, మిరప, టమోటా, వంగ మొదలైనపంట నారును బీజామృతంలో ముంచి నాట్లు వేయాలి.
గమనిక:
సున్నం కలపడం మర్చిపోకూడదు. ఆవుమూత్రం మరియు పేడకు ఉన్న ఆమ్లాగుణాన్ని సున్నం తగ్గిస్తుంది.
బీజామృతం:-
(విత్తనశుద్ధి – విత్తనం మరియు భూమి నుండి వ్యాపించే అన్ని రకాల తెగుళ్ల నివారణ కొరకు)