1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : ఆవుమూత్రం (10 -15 లీటర్లు),పొగాకు (1 కిలో),వెల్లులి (1 /2 కిలో)
పచ్చిమిర్చి (1/2 kilo),వేప ఆకులూ (5 కిలోలు)
తయారీ చేసే విధానం :ఒక మట్టి కుండలో 10 లీటర్లు గోమూత్రం తీసుకోని ఇందులో 1 కిలో పొగాకు ముద్ద,5 కిలోలు వేపాకు ముద్ద ,1/2 కిలో పర్చిమిరపకాయలు ముద్ద మరియు 1/2 కిలో వెల్లులి ముద్ద వేసి
పాత్రపైనా మూతపేటి 4 సార్లు పొంగు వచేట్లుగా బాగా ఉడికించాలి,తర్వాత పాత్రను కిందికి దించి 48 గంటలు వరకు చాలారనివండి చివరకు ఒక గుడాతో వడకట్టి ఒక డాబాలో వేసి ఉంచండి,దినిని 3 నెలల వరుకు నిలువ ఉంచవచ్చు.
గమనిక : అవసరమైనపుడు ఎకరానికి కేవలం 2.5-3 లీటర్లు అగ్ని అస్త్రం సరిపోతుంది
ఉపయోగించే విధానం :ఎకరానికి 2-3 లీటర్లు అగ్ని అస్త్రం 100 లీటర్లు నీటిని కలిపి పిచికారీ చేయాలి ,
అని రకాల కాయ తొలిచే పురుగులు,కాండం తొలిచే పురుగుల్ని నివారించవచ్చు.