బ్రహ్మాస్త్రం

బ్రహ్మాస్త్రం

                             

                                    (పెద్ద పెద్ద పురుగుల నివారణ కొరకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  ఆవు మూత్రం(10 -15 ),వేప ఆకులు(3 కిలోలు),సీతాఫలా ఆకులు(2 కిలోలు),ఆముదం ఆకులు(2 కిలోలు),కానుగ ఆకులు(2 కిలోలు),అత్తాకోడలు(లాంటానా),ఆకులు(2 కిలోలు),

బొప్పాయి ఆకులు(2 కిలోలు),ఉమ్మెత్ర ఆకులు(2 కిలోలు),జామ ఆకులు(2 కిలోలు),కాకర ఆకులు(2 కిలోలు),

పయ్యారిభామ (పార్తినియం)

గమనిక:పైన తెలిపిన ఆకులతో ఏవైనా 5 ఆకులు మాత్రమే ఉపయోగించాలి.

తయారీ చేసే విధానం:   మొదట ఒక పాత్రలో 10 -15 లీటర్స్ గోమూత్రం తీసుకొని అందులో ఏవైనా 5 రకాల

ఆకులని విడివిడిగా మెత్తగా నూరి కలపాలి,కర్రతో ఈ మిశ్రయం కలపాలి,ఆ తర్వాత పాత్ర పై మూత పెట్టి బాగా

ఉడికించాలి.(5 సార్లు పొందు వచ్చే విదంగా)ఆ తర్వాత పాత్రను కిందకు దించి,48 గంటల వరుకు చల్లార నివాళ

ఇపుడు బ్రహ్మాస్త్రం సిద్ధం దినిని ఆరు నెలల వరుకు నిల్వ ఉంచవచ్చును

గమనిక:అవసరమైనపుడు ఎకరానికి కేవలం 2 .5 -3 లీటర్లు బ్రహ్మాస్త్రం సరిపోతుంది.

ఉపయోగించే విధానం :  ఇలా తయారు చేసుకున్న బ్రహ్మాస్త్రం ఎకరానికి 2 -౨,5 లీటర్లు 100 లీటర్లు నీటినీ

కలిపి పంట పై పిచికారీ చేయండి.